Friday, September 22, 2017

Random Amateur lines

వక్త్ కే సాత్ సాత్
సబ్ కుచ్ బదల్ జాతా హై

లోగ్ భీ
రాస్తే భీ
ఎహ్సాస్ భీ
ఔర్... ఔర్... జిందగి భీ..

ఖుద్కో తో ఉంకే పాస్ చోడ్ ఆయే
ఔర్.. హం ఆజ్ భీ బదల్ న సకే

*****


బరస్ బీత్ జాతే జాతే హంకో వహీ రాస్తే పర్ ఛోడా
న జానే తేరి యాదోన్ మే కిత్నే రాహే మూహ్ మోడా

దేఖ్తా హూన్ తుఝే ఆజ్ భీ ఇన్ అంధేరోమే
సున్తా రెహతా హూన్ హర్ పల్ తేరి ఆహటేన్

మంజిల్ తో బదల్ చుకీ హో
ఫిర్ క్యూన్ వహి రాహ్ మే చల్తీ హో
ఇష్క్ తుం భూల్ చుకీ హో
ఫిర్ క్యూన్ అప్ని యాద్ ముఝే
బార్ బార్ దిలాతీ హో


******


బేవఫా కీ చాహత్ మే జెహెర్ పీలియా హమ్నే 
ఆప్కో మొహబ్బత్ కర్తే కర్తే జీలియా హమ్నే

సునా హై కీ బేవఫా మే భీ వఫాయీ హోతీ హై
ఆప్తో వఫా కే నాం పే హర్ బేవఫాయీ కీ హై...!!


******

ఘం ఔర్ ఆగ్ తో దోనో తరఫ్ లగీ థీ
ఫర్క్ సిర్ఫ్ ఇత్నా కీ
తేరే దామన్ మే గులాబ్ బన్ కే
ఔర్ మేరే రాస్తే పే కాంటే బన్ కే
నజర్ హటీ మైనే తేరే రాహ్ సే
పర్ ఇంతెజార్ ఛూటీ నహీ!!

ఖబర్ నహీ తేరా ముఝ్‌కో
పర్ హమేషా కీ తరహ్
బేఖబర్ హూన్ తుఝ్‌కో...!!!


******

తేరే హర్ ఝూటే బాతొన్ పే ఐత్బార్ కియా
జాన్‌కర్ భీ అంజానే మే తేరీ ఇబాదత్ కియా
వజూద్ యే మేరా తేరే దిల్ మే ఛుపా దియా
రూహ్ జో మేరా హమేషా కే లియే తుమ్నే సులాదియా..!!

******

సమజ్ లేతీ థీ వోహ్ బడీ ఆసాన్ సే
మేరీ ఖామోషీ కీ బాతేన్
ఆజ్ చీక్ భీ లేతా హూన్
ఔర్ వోహ్ సమజ్ న సకే ఉన్‌హీ కీ వాదేన్ 

బడీ అఫ్సోస్ హై కీ యూ పలట్ గయే హర్ రాస్తే
అంజాన్ మె తో సహీ, ముడ్‌కర్ తో దేఖో మేరే వాస్తే
జిందా తో హూ, కోయీ మరీజ్ సే కం నహీ, 
దఫ్నా దియా ఉస్నే, జిందగి దేకే కహీ...!!

*******


శ్రావ్యం

ఆ వెచ్చటి కన్నీటిని 
నీ మనసు అణిచేస్తుంది

ప్రవాహంలా సాగే
నీ ఆలోచనలను
ఏ మౌనమో ఖైదు
చేసేస్తుంది

ఏ తోడు చూపిన వేదనో మరి
ఇప్పటికీ నీ భయాలకు
ఊపిరి పోస్తూ ఉంది

ఏ దారి చూడటానికి
ఇష్టపడని నీ కనులు
నిశ్శబ్దంలోనే బిగ్గరగా
రోదిస్తున్నాయి

నీలో అల్లాడుతున్న ఏ భావమో
నెమ్మదిగా నాలోకి దిగుతూ
మాటల తోటలను విత్తుతున్నాయి!!

నిశీధిలో చుట్టుముట్టిన నీ చిత్తం
కప్పబడిన ఎడతెరిపి లేని నీ తలపులు
అంతు చిక్కని కారణం కోసం వెతుకుతూ
నేను, నా కాలం ఇక్కడే నిలబడిపోతున్నాం!!

Sunday, September 20, 2015

స్వగతాలు #4

నీ ప్రతీ పలుకు
దాపరికాలు
అసత్యాలతో
కూని రాగాలు తీస్తుంది


తెలుసుకోలేని ఆ
బరువేదో నన్ను బాధిస్తూ ఉంది
నా కళ్ళను కాల్చే
నీ చేతలేవో
ప్రతి క్షణం వెంటాడుతూ ఉంది


కరుడు కట్టిన ఒకనాటి నీ ద్వేషం
నే ఓర్వలేని అనుభవాలను
చూపిస్తూ ఆనందిస్తుంది


ఊపిరి తిత్తులు ఎగిసిపడేలా
రోదనలు సాగుతున్నా
కరుణించమని అడగక
కాలాన్ని మరలమంటుందీ


నిప్పుల కొలిమిలో
నన్ను పడేసి
రగిలే మంటలలో
ఆజ్యం పోస్తున్నావూ


కణకణం దహించిపోతుంటే
నిస్సహాయంగా ఈ కంటి వెలుగు
పై పైకి కదులుతుంది
నెమ్మదిగా ఊపిరి నిద్రిస్తుంటే
ఆ ఉప్పనేదో ఉక్కిరిబిక్కిరిచేస్తుంది


చివరికేది మిగలని ఈ క్షణకాలంలో
నీవు చేయగలిగిందేముందని ఈ ఓదార్పు
నేనంటు మిగలని ఈ అస్తిత్వంలో
నా దరికెందుకని నీ అమరత్వం


చితికిన నా బతుకులో
రాలిన ఆ పువ్వులో
చెదురైన గుండె కోతలే
కదా మిగిలింది

స్వగతాలు #3

మనసుతో తాపిగా మాట్లాడి చాలా కాలమే అయ్యింది
యద తలుపు తట్టి కొన్నేళ్ళు గడిచినట్టు గుర్తు
కవితకి దూరమై, భావానికి బానిసై
మూగతనాన్ని అంటించుకుంటూ జడత్వంతో నింపేసినట్టున్నా...
లయ తప్పిన రాగమేదో తప్పుగా వినిపిస్తూంది
తడబడిన పలుకులేవో నిశ్శబ్దంలో కరిగిపోతున్నాయి
మసకబారిన కనులతో మరదీపం దగ్గర నేను..
వెలుతురుకావల ప్రపంచంలో కనిపించకుండా నువ్వు... !!

స్వగతాలు #2

కన్నీటి జడిలోనా నన్ను ముంచేస్తూ
వెతలన్ని లతగా కూర్చకే ప్రేమా..!!

రొప్పుతున్న గుండెలోన నిన్ను దాచలేక
కథలన్ని కవితగా నే రాసుకున్నా..!!

ఆలపించని రాగమొకటి విన్నవించవా
ఆలకించని గానమొకటి వినిపించనా..!!

నిశీధిలో తారలన్ని ఇసుకతిన్నె చేరగా
మరలిన హ్రుదయాలయాలు మెరుపులలో కలవగా...!!

స్వగతాలు #1

నా మౌనమే నాకు భారమౌతుంది
నోరు పెగుల్చుకురాలేని మాటకు
విలువ కట్టవని మూగబోయింది

ఈ వేదనంతా ఉప్పెనౌతుంది
నీకు అర్థం కాని ఈ బాధ
నాలోనె ఇమిడిపోతుంది ... 

నిన్ను ఒంటరిగా మిగిల్చినందుకు
కాలం నన్ను అనాధగా నిలబెడుతుంది..!!

Monday, March 30, 2015

ఆత్మ


నా స్వేచ్ఛ విహంగాలు
నీ భుజానికెత్తుకున్నావు
కర్మకి బంధీనై
నన్ను నేను నిందించుకున్నాను

వీడని భ్రమలో
ఈ జీవితం కరిగిపోతుంది
సంకెళ్ళు తుంచుకుని
కొత్త కలలు పోగేసుకుంటున్నావు

దారి తప్పిన నాకు
దిక్సూచి కరువయ్యింది
కొత్త ప్రయాణం నిన్ను
నూతన గమ్యాలు చేర్చింది

ఆత్మని విడిచిన 
శరీరం నిర్జీవమయ్యింది
నన్ను వదిలిన ఆత్మని 
కొత్త లోకం స్వాగతించింది..!!

Monday, October 3, 2011

భ్రమ


గాలినై తిరుగుతుంటాను
ఇప్పటికీ..ఇక్కడే.. ఎక్కడో..

గమ్యం తెలీని ప్రయాణానికీ
గమనమై ఆసలు నింపావు

నా గగనానికి దారులు వేస్తు
నీ వారధులను కూల్చుకున్నావు
ఆ తారలను అన్వేషిస్తూ నేను
ఇప్పటికీ.. ఇక్కడే.. ఎక్కడో..

అబద్దపు మమతలను ప్రోగు చేస్తు
నిజమైన బంధాలు తుంచుకుంటున్నాను
అదే భ్రమలో జీవిస్తూ ఇంకా
ఇప్పటికీ.. ఇక్కడే.. ఎక్కడో..
గాలినై తిరుగుతున్నాను...

Friday, September 16, 2011

నైరాశ్యం

నీ కబురు చేరే దాకా
నేను నిశ్చేష్టుడనై  
ఎదురు చూస్తుంటాను

నీ స్వరం తాకే వరకు
ఆ అగాధం అంచున
శిలలా నిలబడిపోతాను

నీ చూపు సోకని కాలం
ఈ శూన్యపు లోకాల్లో
నేను బందీనై ఉండిపోతాను

నీ కాఠిన్యత కరగనప్పుడు
నీ దారిలో నా కోసం నేనే
ఎదురు చూస్తుండిపోతాను....

Sunday, July 31, 2011

ప్రేమకి చావు లేదు



నిరాశలే వాడిన పుష్పాలై
ఉప్పు నీటిలో ముంచేయగా
అలిసిన బతుకు సంద్రంలో 
సమాధి చేసిన విషమే
ఊపిరి పోసిన అమృతం
మనసు చూసిన నరకమే
నూరేళ్ళ ఙ్ఞ్యాపకాల స్వర్గం

నా పోరాటానికి అలుపు లేదు
ఈ ప్రేమకి చావు రానే రాదు!!  

Tuesday, July 26, 2011

నచ్చిన మరో వ్యాఖ్య

"ఎప్పటికీ నాతో నడవని నీకోసం
ఇప్పటికి ఇక్కడే ఆగిపోతానంటున్న గుండె వంక చూసి
తెలుసుకున్నాను నాకు నీ గ్నాపకాలు కూడా మిగలలేదని"

Thankful to Anonymous for the comment. 

Saturday, July 16, 2011

స్పందన


ఆశించని వరమే
ఈ పూట పూవై పూస్తానంటే
దోసిలి ఒగ్గి పట్టేందుకు 
కాలమే అడ్డు నిలుస్తుంది

మలుపులే తన గమనంగా సాగే జీవితంలో 
నీ చిరునవ్వులే రంగులై అలరిస్తానంటే 
చేతకాని ఈ క్షణం తత్తరపడుతుంది

స్పందన తెలీని ఈ మనసుకి కళ్ళున్నా
నీ యద చప్పుళ్ళు కనిపించేవేమో 

మలి సంధ్యల్లో మూగపోయిన నీ మనసుకి
తొలి వేకువే నన్ను నీ దరికి చేర్చాలని......

Saturday, January 22, 2011


అలిసిపోయిన కనులలోన 
నీ కలలే యాతనవ్వగా..
సేద తీర్చని నీరు ఉబికే
మాట రాక రెప్ప వాలే...

తరలిపోయిన నింగిలోనా
ఈ చీకటే నిలిచిపోగా..
కానరనీ జాడ వెతికే
చూసి చూసి ఆశ కరిగే...

Thursday, September 2, 2010

వెతలు

రోజులన్నీ గడిచిపోతూనే కాలం
నా దగ్గర నిలిచిపోయింది
నన్ను తాకని ఈ గాలిలో
రాతలు నేర్పుతూ మరో రేయి కలిసిపోయింది

మర వెలుతురులో మసకబారుతున్న కనులు
మరువలేనంటూ తోడు నిలుస్తున్నాయి కలలు

క్షణాలన్నీ నాకేసి జాలిగా చూస్తూ
తడి చూపులలో తేలక మునిగిపోతున్నాయి
గతించిన కాలం వెక్కిరిస్తూ సాగనంపుతుంది
గతమెరిగిన జీవితం 'నేను 'ని శాసిస్తుంది

కదిలి వస్తూనే కడలి, గురుతులన్నీ
చెరిపేసి పోయింది
కదలకనే అడుగులేమో, కొత్త
గీతలు గీస్తూ ఉండిపోయింది 

రోజులన్నీ గడిచిపోతూ కాలం
నా దగ్గర నిలిచిపోయింది
నన్ను తాకని ఈ గాలిలో
రాతలు నేర్పుతూ మరో రేయి కలిసిపోయింది. 

Friday, July 23, 2010

ప్రేమంటే..?


ప్రేమంటే -
నువ్వున్నప్పుడు నన్ను నేను
నువ్వులేనప్పుడు ఈ లోకాన్ని, మరిచిపోవడం

ప్రేమంటే -
నీ ఆరాధనలో నిలువెల్ల తడవడం
నీ ఎడబాటులో మునిగితేలడం

ప్రేమంటే -
నా మౌనానికి మాటలు నేర్పడం
నా మనస్సుకి వెన్నెల పంచడం

ప్రేమంటే -
ఈ ఊహలకి రెక్కలు తొడగడం
నా కలానికి కవితలు నేర్పడం

Tuesday, July 20, 2010

ఐ లవ్ యూ


వెంట నడిపించే 
నీ విరసాలంటే నాకు
చెప్పలేని ఇష్టము..
నీతో మరో మాట కలిపేందుకు
సాయం చేస్తుంటాయి..

నా మాటకి అడ్డుచూపే
నీ సరిపోలంటే
మరెందుకో ప్రియం..
మౌనం లో నిన్ను దర్శించమని
సలహాలిస్తుంటాయి..

వాలుగా జారే నీ చూపు
వెక్కిరింతలే
నేను గాంచే యోగము..
నే పోల్చలేనీ వస్తువేదో
కానుకీయమంటాయి..

ఎదురు పడని నీ కైపు
కనుదోయంటే
నా యదను కుదిపే రసితము..
మనోఙ్ఞ్యత ప్రాయమేదో
నన్ను కొమరారమంటాయి...

చకిత చిత్తమైన నీ
పెంకి మనసంటే
విడువలేని స్నేహం..
త్రస్తరించే దాని పలుకులేవో
పోలికలే వద్దంటాయి..

ఇది స్నేహమని మాత్రమే
తలచే ఆ సత్యమేదో
వివరించలేని నువ్వంటే
నాకు తరగని ప్రేమ..

ఇది తెలుసుకున్న మరుక్షణం
చిత్తురవయ్యే నువ్వంటే
నే చెప్పలేని భావం..!!

Sunday, July 18, 2010

ఎదురుచూపు



మెరుపు చుక్కోటి తొంగి
నా వంక చూసింది...

మెతక మబ్బు కాటుకెట్టి
అడ్డు నిలిచింది...

కమ్మిన మబ్బు గుండెలో
వాన చినుకులు..
కంటి నిండ దాచలేని
ఈ నీటి చుక్కలు..

తేట పందిరిలో
మురిపించిన ఆకసం..

అడగించక తడిపెళ్ళిపోయింది
ఈ వడబావిలో

తెరిపే కాదేమో అని
తిరిగి చూసింది
తనవి తీరక సెగ చల్లారక.. 

ఆకసం


మెరుపు చుక్కోటి తొంగి
నా వంక చూసింది...

మెతక మబ్బు కాటుకెట్టి
అడ్డు నిలిచింది...

కమ్మిన మబ్బు గుండెలో
వాన చినుకులు..
కంటి నిండ దాచలేని
ఈ నీటి చుక్కలు..

తేట పందిరిలో
మురిపించిన ఆకసం..

అడగించక వార్వమాపెళ్ళిపోయింది
ఈ వడబావిలో!!



దిలీపు గారి ఆకాశ కుసుమానికి నా స్పందంగా..


Monday, July 12, 2010

కన్నీరు


 ఎన్ని కవితలు ఎన్ని రకాలుగా రాసినా వాటిలోని భావాన్ని మహిత గారు నా ప్రేమికుల రోజు అనే కవితకి కామెంటుగా రాసిన కేవలం నాలుగంటే నాలుగే పంక్తుల్లోనే మొత్తం భావాన్ని దించేసారు. ఆ నాలుగు లైనులు నన్ను ఎంతగా ప్రభావితం చేసాయంటే even today, to this every second, they are haunting me like anything.  So, I wanted to dedicate a special post especially on her lines.  Thanks once again to Mahitha. Here it goes like this :

కనురెప్పలు మూయగానే కన్నుల్లో నిండుతున్న నీ రూపం

కనులు తెరవగానే కన్నీళ్ళుగా కారిపోతోంది.

నీ రూపం కన్నుల్లో నింపుకునే ఆఖరి ప్రయత్నం

ఎప్పటికీ తెరవని కన్నులేనేమో 


నాకెంతో గొప్పగా అనిపించిన భావం ఇది.  Anyone not agreeing with me, requesting not to pass any comments here. :) 

Friday, July 9, 2010

నిషిద్ధ్హ ప్రేమ



ఎపుడూ మెరిసే నీ కనులు
ఎందుకు ఉద్వేగంగా మారుతుందో

యదలోనీ ప్రశాంతతను
తెలియని ఏ వాంఛ
నన్ను కబళిస్తుందో

దహించివేసే నా ఆరాధన
నీ మనసుని రగిలిస్తుందన ..
అల్లల్లాడుతున్న నా విరహం
నీ మృదుస్పర్శ కోసం తపిస్తుందనా ..

ఇన్నాళ్ళకు ఓడిన ఈ దూరం
మోహమై కరిగి మన హద్దులు
కడుగుతోంది ..
ఈ అడ్డు చెరిగిపోతుంది ..

భగ్గుమంటున్న ఒంటరితనపు
సెగలు కాల్చకముందే ..
నీ బాహుబంధాల్లో నలిగిపోనీ ..
తెలియని లోతులలోకి ఇంకిపోనీ ..
అలసి కృంగిపోనీ ..

నీలోకి
అవలీలగ
చొచ్చుకపొనీ ..

రమించే మత్తులో ఎదిగిన కోరికలు
పూర్తిగా లొంగిన ఈ క్షణంలో
చివరకు అచేతనంగానైనా
ఇమిడిపోనీ ..

ఇరువురి బాధలు కరిగే
ఈ ఘడియన ..
నీ తనువు చెప్పినట్టుగానే ..
ఈ రేయిని గడవనీ ..

ఈ వెచ్చటి వేదికపై
వేతన పెట్టిన కోర్కెల
ఆహుతి ఆరే దాకా సాగనీ ..

మన నిషిద్ధ ప్రేమను
నిలువెత్తు రగిలిపోనీ ..

కరుణించవూ

నా ప్రేమలో స్వార్ధం చూశావు
నా తపనలో తప్పులు వెదికావు
నా మనసో బంధమనుకున్నావు
నా అలుసో పంజరమనుకున్నావు

ఆ తలపులే మన  ఈ
దూరాలకు మూలాలైతే
ఆ తలపులు మనకికలేవు
ఈ దూరాలకిక అర్ధాల్లేవు

పరులతో మాటాడినా పార్టీలకు పరుగెట్టినా
చాటింగులో బిజీ ఐనా మూవీల్లో కుషీ ఐనా
ఫోనుల్లో ఎంగేజైనా సమక్షంలో నన్ను మరిచినా
పరోక్షంగా నను తలచినా ఎటెళ్ళినాఏంచేసినా
ఇంకేమీ అడగను నిన్నేమీ అడగను

నీ స్నేహం పొందాలన్న తపనలో తప్పులు చేశానేమో
నిను నొప్పించానేమో నన్ను మన్నించవూ

నిన్ను తెలుసుకోవాలన్న ఆతృతలో అవన్నీ అడిగానేమో
నిను నొప్పించానేమో కాస్త కరుణించవూ


(ఆత్రేయ కొండురు గారు నా పొస్సెస్సీవ్ ప్రేమ ని మెరుగు పరిచి ఈరూపంలో అందించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు.)

Wednesday, June 2, 2010

మానస వీణ

రాసే కొద్ది గుర్తొస్తావు
తలచేకొద్ది కలచివేస్తావు
మరుపంటు రానివ్వక
అలుపంటు తెలియనివ్వక
అనుక్షణం వెంబడిస్తావు

తోడు

నీ రాకతో నా కలం ఆగింది
తోడుగా నీ మనసు చేరింది
****
నీది మమకారం
నిండిన మనసే
ఐతే, కాఠిన్యత
దాని లక్షణం
****
నువ్వున్నప్పుడు పరుగెట్టిన కాలం
ఇప్పుడెందుకో కదలనంటోంది
****
పెరిగిన ఈ దూరం కలచివేస్తుంది
నా కలం తోడు నిలిచింది
బాధ తెలుపలేక మళ్ళీ
పిచ్చి రాతలు మొదలుపెట్టింది

Monday, March 22, 2010

ఒంటరి మాను

నన్నింకా ప్రేమిస్తున్నావనే తలంపుతో ఉంటే
అది భ్రమ అని తేలికగా కొట్టిపడేస్తావు

నీ ఆప్యాయతని స్పృశించాలనుకున్నప్పుడల్లా
నీ ఆస్మిత ప్రవర్తనతో నన్ను గెంటేస్తావు

నాలోకి నువ్వు చొప్పించిన ప్రతీ భావోద్వేగము
నీ ఙ్యాపకాల చితి మంటల్లో కాలిపోయాక
నాకంటు ఇక మిగిలిందేముందని వొంటిగా
ఏకాంత ఆలోచనలలో లోతుగా మునిగిపోతాను...

Saturday, March 20, 2010

నే రాసే ప్రతీ పదంలో
నిన్ను వెతుక్కునేదానివి
ఇప్పుడేమో, నే రాసేది నీ
కొసమే అని తెలిసినా
నిను చేరనివ్వడం లేదు
నా ఆవేదనని

**********

ఒక్కోసారి కోపమొస్తుంది
ఏం చెయను! వ్యసనంగ
అల్లుకున్న నిన్ను వదులుకోడం
కష్టమే మరి నాకు!

**********

మనసు మార్చుకున్నావని
అనుకున్నాను గాని
మనిషివే మారిపోతావనుకోలేదు

Thursday, March 18, 2010


కళ్ళ కొసల్లో వేలాడే
భాష్పాలు చారికలుగా అంటుకుపోయేది
చితికిన మనసు నెర్ర
నెర్రలుగా చెక్కుకుని మూలుగుతుండేది

రవ్వంత ప్రేమతునక
ఎదురుగా వేలాడితే చాలు
ఛిద్రమైన గుండె తన
ఒడిని ఒళ్ళంత పరిచేది

ఆశలొదిలేసిన ఈ హృదయం
అప్పుడప్పుడు ఊపిరివేళ్ళను
తడుపుతూ బతుకునీడుస్తుండేది
సరిగ్గా అప్పుడే-

ఒక్కొక్కటిగా రాలుతున్న శిశిరంపై
వెచ్చని వసంతంలా పరుచుకున్నావు
లాలిత్యం ఆశించని బతుకుకి
లాలిపాటని అందించావు

కూలబడిన ప్రతీచోటాల్లా
నడక వీడిన ఆ దారంటా
నడి వేడిమిలో పూలు పరిచావు
సడి రాతిరిలో జాబిలివయ్యావు
వడి వడిగా వెన్నెల గుత్తులై
నా జీవితంలో విరబూసావు

ఆశల లతని పాదు చేస్తూ
అనుక్షణం నన్నల్లుకుపోతు
మంచు తుషారమై కురిసావు

నీ ప్రేమ సముద్రమని తలచి
జోగాడే పడవనై ఒదిగిపోయాను
ఆత్మీయత పంచుతూ సుతారంగ
నా మనసు మీటుతుంటే కమ్మని
వీణ పాటై కరిగిపోయాను

పంచుకున్న కలలు కల్లలని
కాలం వాటిని రక్కిపోతుందని
ఒకదానితో ఒకటి పెనవేసుకున్న
మనసులను అమాంతంగా నువ్వు
విడదీస్తే, తట్టుకోలేని నా చిన్ని
గుండె నెత్తుటి జడులు విదుల్చుతుంది

ప్రేమని చంపి స్నేహితులమని
మనసుని మాయ చేయడం నీకు
తగునేమో, అయినా -
స్నేహమాంటే ఇష్టమని
ఇష్టమంటే ప్రేమని
ప్రేమంటే నువ్వని
నువ్వంటే ప్రాణమని
నీకు చెబుదామనుకున్నాను
కాని -
నీ సమక్షంలోనే నువ్వు
అలక్ష్యం చేస్తుంటే నా
యద కవాటాలు చెల్లా-
చెదురుగా గాల్లోనే చీలిక
పీలికలై పిడచకట్టుకుపోయాయి

బీడు గుండెని నిమరలేని
మొండి చెయ్యిగా, శాశ్వతంగా
మిగిలిపోయావు నా పట్ల

Tuesday, March 16, 2010

నిరీక్షణ

రాత్రులు కరిగిపోతాయి
పగలు గడిచిపోతాయి
నిద్దుర బరువుని నా
కనురెప్పలు అలవాటుగా
మోసేస్తాయి! ఎప్పుడైనా
నువ్వొస్తావని, రేయంతా
నీకోసం ఎదురుచుస్తానని,
నీకు తెలుసా!

నెమ్మదిగా సాగే మేఘంలా
మందితో గూడి వచ్చి ఆటల్లో
మునిగిపోతావు. అలా
మాటుగానైనా నిను చుసి
మురిసిపోతాను కాని,
ఎందుకనో కంటి చివర
తడి ఇబ్బంది పెడుతుంది!!

నిన్ను చూసిన ఆనందం కంటే
కినుకు వహించే నీ మనసే
నన్ను కష్టపెడుతుందేమో!

అయిన -
నీ పలకరింపుకోసం
పడిగాపులుకాస్తుంటానని
నీకు తేలుసా!!

Wednesday, March 10, 2010

చివరి మెట్టు

నీ మాటలే ఎప్పుడు
నడిపిస్తుండేవి
నా మనసుకి అవే
ప్రాణాధారం మరి

*****

ఆవల నీ ప్రపంచంలో
నవ్వులు పూయిస్తుంటావు
నా పెదవులపై
ఎందుకనో వాలవు

*****

నాకు పశ్చిమాన నువ్వు
నీకు తూర్పున నేను
మన మనసుల మధ్య
ఏర్పడిన అగాధం

*****

ఇంకిన కన్నీటికి
విలువ తరిగిపోయింది
మోడువారిన ఆత్మ
కాలాన్ని శాసిస్తుంది...

Thursday, March 4, 2010

I MISS U

నేను అందరి మధ్యనే ఉంటాను, కానీ
ఏదో శూన్యం వేటాడుతుంది నన్ను,

అందరి అభిమానం పొందుతున్నాను, కానీ
నువ్వు చూపించిన తీరు వెంటాడుతుంది నన్ను,

కబుర్లెన్నో ఆలకిస్తుంటాను, కానీ
ఎవరి మాటలు నా చెవిని చేరవెందుకో,

నాకంటు లేనిది ఏదో తెలీదు, కానీ
నే కోరేది ఎల్లప్పుడూ నీ స్నేహమే!
అందుకేనేమో,

నీ వెలితితో నేనిప్పటికీ
అసంపూర్ణంగానే మిగిలిపోయాను

Wednesday, March 3, 2010

ప్రణవి

నడిరేతిరి గాలుల్లొ నెమ్మదిగ ఒదిగిన క్షణాలు
తరగని దూరాలతో బరువుగా నిట్టూర్పులు విదుల్చుతున్నాయి

ఎదలోతులోకి ఎగబాకిన నల్లటి చీకటి
ఇక రాకు అంటూ నన్ను వెనక్కి నెట్టివేస్తున్నాయి

బాధ్యత నిండిన కనురెప్పల చప్పుళ్ళు
బంధం తుంచుకోమని ఆదేశిస్తున్నాయి

దూరాన తళుక్కుమంటూ మురిపించిన మాటలు
సంద్రపు హోరులో వెతుక్కోమంటూ మౌనం వహిస్తున్నాయి

చెరిగిన దూరాలు నా దారిని కలిపేలోపు
ఎన్నెన్నో యోజనాల ఆవలికి ఎగిరిపోయావు

విసిగిన మనసు తూటాలుగా నిన్ను పొడించిందేమో
నువు అల్లిన పరదాలు నా దారినిండా కమ్ముకున్నాయి

ఒత్తిళ్ళల్లో ఒదిగిన తపన తమాయించుకుంటూ
ఒంటరి క్షణాలతో కూడి ప్రణవ నాదం చేస్తున్నాను
ఎవరికి వినిపించకుండ రోదిస్తున్నాను!!

Friday, May 8, 2009

పయనం.. ఒంటరి పయనం


కాల చక్రం..
నజ్జవుతున్న బ్రతుకు దొంతరలు ..
పులిమిన కృత్రిమ నవ్వులు
అడుగు జాడల్లెని అడవి
చీకటి, గడిపిన ఆ కొద్ది క్షణాల భారాన్నీ
మోసుకుంటూ.. కాళ్ళీడుస్తూ..
ఒంటరి పయనం...
సుడిగాలిలా..
అంతరాళాల్లోనించి
ఆలోచనల్లో బహిర్గతమవుతావు
ప్రతి పలకరింపూ ఓ తీయని వేటు ..
గుండె ముక్కలు పొదివి పట్టుకుని
ఓ అజ్ఞాతగా.. నన్ను
మోసం చేసుకుంటూ.. తడబడుతూ..
గమ్యమెరుగని ప్రయాణం
మరచాననుకుంటూ..ఏమరుచుకుంటూ..
అలలా వీడలేక.. కలలా మిగలలేక..
బ్రతుకీడుస్తూ..
పయనం.. ఒంటరి పయనం !
Note : నే వ్రాసిన వెళ్ళిపో నేస్తానికి తన స్పందన గా తన మాటలలో పదాలలో దానిని ఇంకొంచెం భావాన్ని అద్ది సున్నింతంగ స్పృశించి తనదైన శైలిలో మెరుగుపరిచి నాకందిచిన ఆత్రేయగారికి (http://aatreya-kavitalu.blogspot.com) ప్రత్యేక ధన్యవాదాలు.

Saturday, May 2, 2009

వెళ్ళిపో నేస్తమా

నిన్ను మర్చిపోయాను
యాంత్రిక జీవనంలో
బతుకు పోరాటం సాగిస్తూ
నీ జ్ఞ్యాపకాల దొంతరలను
అణిచివేసాను
కృత్రిమ నవ్వుల్ని పులుముకుని
ముఖస్తుతి మాటలు కలుపుతూ
అడుగు జాడల్లేని అడివిలో
ఒంటరిగా కబుర్లు చెబుతున్నా
నీతో గడిపింది
కొద్ది క్షణాలే అయినా
నాతో పాటు అవి
తోడుగా వస్తూనే ఉన్నాయి
ఏదో ప్రవాహం ఛుట్టుముడుతుంది
అలలతో పాటు అట్టడుగుకి వెళ్తావు
కడలి వలే పొంగుతూ
మరలా సుతిమెత్తగా తాకుతావు
ఏం చెప్పేది
నీ ఒక్కో పలకరింపు
నన్ను బాధించిన వైనం
నీ కన్నీరొలికినా
ఏమి చేయలేని చేతకానితనం!
వెళ్తూ వెళ్తూ
గుండెని సగం కోసి పోయావు
ఇంకో సగం మిగిలిందనా
నలిపేయడానికి తిరిగొచ్చావు?
నీ చాయలు నాపై
ఇకలేవని మొండిగా వాదిస్తానే కాని
అలా నన్ను నెను
మోసం చేసుకుంటున్నాను, తెలుసా?
నిజం చెప్పాలంటే
నిను మర్చిపోతున్నాననుకున్నాను
కాని, ఎంత ప్రయత్నించినా
నిను మర్చిపోలేకున్నాను !!

Saturday, February 14, 2009

ప్రేమికుల రోజు

కలల తివాచి ఇంకా మడవనే లేదు
నీ జ్ఙ్యాపకాలు ఇంకా మరుగున పడలేదు
నా మదిలో నీ మోము ఇంకా మసక బారలేదు
చెదిరిన గూడువైపు దారి మళ్ళిస్తూ
ప్రేమికుల రోజు పరిగెత్తుకొచ్చింది నా కడకు!
చెమర్చిన కనులలో నీరు నింపుతు
నీ పెదవిపై నా పేరు నిలుపుకొంటు
మనకు కలిగిన గాయం గుర్తు చేసుకొంటు
చెదిరిన ఆశలవైపు వేలు చూపిస్తూ
ప్రేమికుల రోజు పరిగెత్తుకొచ్చింది నీ కడకు!!
నీ ఏడబాటు నాకు అమూల్యమైనదని నీకు తెలుసా?
నా కనుల ముందు నువ్వు మెదిలే ప్రతీ సారి అది
నా మనశ్శాంతిని భగ్నం చేస్తుంది, అయినా
నిను తలుస్తు కాలానికి ఎదురీదడం నేర్పుతుంది!
బాధనిండిన రాత్రులలో ఒంటరిగా
చెరో ధ్రువం వైపు తడవడం ఎందుకు?
పిలిస్తే నీ కోసం దేనిని లెక్క చేయని
నాకోసం నువ్వు ఒక్కసారైనా వచ్చేయలేవా ??
ఈ ప్రేమికుల రోజు కలిసి జరుపుకొందాము!!

Monday, January 26, 2009

తిరిగొచ్చిన శిశిరం

మానుననే అనుకున్నాను
మోడువారిపోయి ఉన్నాను
ఆశల రెక్కలన్నీనేల రాలగా
జ్ఙ్యాపకంగా బరువుతో కృశించిపోతున్నాను.
తూరుపు తెలవారుతూండగా
లీలగా తాకిన ఏదో స్పందనగా
మనసత్వాలలో కొత్త వసంతంలా చేరి నిండిపోయావు.
నీ చిర్రుబుర్రు మాటలతో
అల్లరి కోపాలతో
గ్రీష్మమై నాకు ఊపిరి పోస్తు వచ్చావు
నీ ప్రతీ నవ్వు నాకు అందిస్తూ
ఆనందాన్ని రుచి చూపిస్తూ
శరదృతువై నా కన్నీటిని తుడిపేసావు
నన్ను నేను తెలుసుకోగా
నీకు నే దగ్గరవగా
నిన్ను నాలో దాచేయగా
హేమంతానివై పూర్తిగా ఒదిగిపోయావు.
నిన్ను నా చెంత చూసి
తారలన్ని చూపు తిప్పగా
రమణీయ రాగాలలో
నీ కబుర్లన్నీ ఆలకిస్తున్న వేళ
చిన్నబోయిన వెన్నెలంతా
నల్ల మబ్బు చాటు చేరి తుఫాను రేపింది.
కాలమంతా రెప్పపాటులో సాగిపోగా
మునుపటి ఏకాంతం మరల చేరగా
వెచ్చని నా కన్నీళ్ళు మంచుపొరని కరిగించగా
తిరిగొచ్చిన ఈ శిశిరంలో
చిగురించిన ఎడబాటుని నాకు జతచేసి
మరుపురాని జ్ఙ్యాపకంగా మిగిలిపోయి
నన్నొదిలిపోయావు!!

Monday, December 8, 2008

కలవని రేఖలు

వృక్షం ఒకటే
చెరోవైపు ఎదిగిన కొమ్మలం
ఒకటవాలనుకున్న చుట్టపట్టాలం
సాంప్రదాయ దారాలలో
ఇరుక్కున్న చకోరులం
ప్రయాణం ఒకటే
చేరాల్సిన మజిలీలు వేరు
వీడలేక నువ్వొదిగిన తీరు
నాలో మెదిలే కొద్ది
రాలుతుంది కన్నీరు
ఆత్మ ఒక్కటే
ఎన్నటికి ఇక కలవలేము
నను మరిచిపోతూ నువ్వూ
నిను మరవలేక నేను
మరో తొటలో నిలువలేము
తపస్సు ఒక్కట
కలవని చూపుకి నిదురరాదు
వెన్నల నెలవంక పలకరించదు
నన్ను తాకని ఉషస్సులో
నా జీవితం తెలవారదు
కోరేది ఒక్కటే
అల్లల్లాడిన ప్రాణం అంతమైనప్పుడు
నేల రాలిన ప్రేమ కుసుమం
నే దోసిట పట్టుకుని
నిన్ను నేనూ చేరడం.

Sunday, November 23, 2008

తరగని విరహం

నా కళ్ళ ముందర చెదిరిపోని నీ రూపం
ఈ చిన్ని గుండెలో రేపిన అలజడి ఎంతో తెలుసా?
వెన్నెల నీడలో ఆవిరైన కన్నీళ్ళు, మేఘమై
వర్షినట్టుగా, మనసు నిండా ఒరిగాయి.
కాలమెంత గడిచినా నీ స్మ్రుతులన్నీ వెన్నంటే
నిలవగా, నెమరేసుకుంటూ నే అల్లినా గీతాలు ఎన్నో!
అయినా -
ఎంత కవిత్వం రాసినా ఈ విరహం తరగదెందుకో!!

Tuesday, November 18, 2008

నువ్వు - నేను

అక్కడెక్కడో నువ్వు
ఒంటరిగా నేను
మదిలో మెదులుతావు నువ్వు
నీకోసం ఆరాటపడతాను నేను
వెచ్చని తలపువై మండిస్తావు నువ్వు
అమర ప్రేమనై వర్షిస్తాను నేను
గాలివై వచ్చి కదిలిస్తావు నువ్వు
అలుపెరుగక ప్రవహిస్తాను నేను
సౌందర్యం నింపుకున్న సాగరం నువ్వు
ఆనందం పొందుతున్న తరంగం నేను
నా కవిత సృష్టించిన ప్రకృతి నువ్వు
తన్మయత్వం నిండిన ప్రణయంతో నేను
అక్కడెక్కడో నువ్వు
కలుస్తామన్న ఆశతో నేను

Monday, October 6, 2008

ఓదార్పు

మునుపటి కన్నా చేదుగా వచ్చిన
ఈ గ్రీషం కూడా నాకు తోడు లేకుండాపోయింది!
శరదృతువులోని ప్రతీ చినుకు నను తడుపుతూ
నా కన్నీరుని తుడుస్తుంది కాని, ఏ గాలీ
నను చేరదేం!! అయినా, ఆ నింగిలో ఎన్ని
మబ్బులున్నా, ఏ మేఘము నను ఓదార్చదెందుకని!
మండే ఎండకి, పడే వానకి, వీచే గాలికి -
వెలుగుని కమ్మే నిశికి, వేకువఝాము మౌనానికి -
అన్నిటికి తెలుసు. నేను ఎవరితోను ఏది పంచుకోనని!
అయినా, ఎందుకనో ఒక్కోసారి ఆరాటపడతాను.
'ఎవరన్నా నా మౌనానికి సాక్షి గావాలని'!

Saturday, October 4, 2008

నీతోడు కావాలి

ఆ కారుమబ్బుల చాటున
నేను మౌనంగా ఏడ్చాను.
ప్రతీ క్షణం
తన ధ్యాసలోనే గడిపాను.
కనుమరుగవుతుంటే వెంటబడుతూ
నిస్సహాయుడనై కూలబడ్డాను.
గుండె నిండా పేరుకున్న బాధ
కన్నీరై వెల్లువలా చుట్టుముడుతూంది.
ఓ మనసా! నేను ప్రయాణించాల్సింది ఎంత ఉందో!
చేరాల్సిన మజిలి ఏ దిక్కున వుందో!!
కనుక తన జ్ఙ్యాపకాలు వీడిపోనీకు!
నా కంట కన్నీరు ఇంకనివ్వకు!!

Friday, October 3, 2008

నా ఆశకి శ్వాసవి నువ్వు

నా నవ్వులు నీకు పంచాలని
నా కలలో నిన్నే చూడాలని
చుక్కలన్ని నీ ముంగిట దింపాలని
నా ప్రతీ పదము నీకె అంకితమివ్వాలని
నా సంతోషం లో నువ్వే నిండి ఉండాలని
నీ చిరునవ్వులో నీ పెదవి వొంపునవ్వాలని
ఎనాటికీ నిన్ను వీడిపొవద్దని
నా మనసుని నీకే అర్పించాలని
నీతోనే కలిసి పయనించే బాటసారిని కావాలని
నీ కోరికలో ప్రేమనై
నీ ప్రేమలో స్వార్ధమై
నీ కళ్ళలో ప్రతీ రూపాన్నై
నీ గుండెలో గానమై
నీ అడుగులో ధూళినై
నీ మాటల్లో పలుకునై
నీ చూపులో వెలుగునై
నీ కవితలో భావన్నై
నీ మేనికి ఛాయనై
నీ వెంట నీడనై
నీ ఆశకి బదులవ్వనా...
నా శ్వాసలో నిన్ను దాచేయనా!!!

Monday, September 1, 2008

నువ్వంతా విషాదమే!!

నీకు తెలుసా?
నిన్న నిశి రాతిరిలో నేను ఒంటరిగా ఉన్నవేళ
నీ అలోచనలు నా ఎద నిండా కమ్ముకున్నాయి.
మరలి పొమ్మని ఎంత చెప్పినా వినలేదు కాని -
ఏ ఆనందము మిగిల్చని నువ్వు
విషాదంలోనూ ఆనందిస్తున్నానని తెలుసుకున్నావేమో!
ఈసారి దాని నుండి కూడా నన్ను వేరు చేసావు!!
నువ్వంతా విషాదమే తుషారమా!!

Friday, August 22, 2008

గెలిచానా?? ఓడానా??

ఈ పోరాటం లో నేను ఓడిపోయి
నిన్నుచేజార్చుకున్నాను
నేనే గెలిచానని కాలం నన్ను గేలిచేస్తుంటే
నిన్ను నా నుంచి కాజేయగలిగింది కాని
నీ జ్ఞ్యాపకాలని మాత్రం
చెరిపేయలేకపోయిందని గుర్తుచేసాను
మనసు చెప్పింది - నేనే గెలిచానని!
నీ జ్యాపకాలైతె నా దగ్గర ఉన్నాయి కాని
నువ్వు మాత్రం లేవు
జీవితం చెప్పింది - నేను ఓడానని !!!

Friday, August 15, 2008

డ్రీమ్ గర్ల్

నిండు పున్నమి అందంగా జారే వేళ,
నేలకి తాకే ఆనందంలో -
రివ్వున దూసుకువస్తున్న నీటి బిందువు
గాలి తిమ్మెరతో రమిస్తూ ఆవిరవుతూందెందుకని?
ఏవో ఊహల సమూహాల నడుమ -
అందంగా కదలాడే నువ్వు
నీ అందెల సవ్వడి నా హృదయానికి చేరేలోపు
స్వప్నంగా మిగిలిపోతావెందుకని?
నిదురలో లిప్తపాటు కలిగే ఈ ఆనందాన్ని
సాక్షాత్కరించలేక కంటిపాప కసురుతూంటే
ఆ విసురు నీకు చేరదేం!
నువ్వు మనస్సుకి మాత్రమే అందే భావానివా??
నిన్నెలా చిత్రించను!!
ఒళ్ళంతా తడిసిన బట్టలతో
క్రీగంట చూసే తరుణిలో నీ అందాన్ని చూడనా!
పలికే కోయిల గొంతుతో నీ కంఠానికి నునుపుతేనా!!
పురివిప్పె నడయాడే నెమలి
వయ్యరాన్ని తెచ్చి, నేను ముద్రించనా!
మంచు తెరల చాటున -
అరువు తెచ్చిన రవి కుంచెతో,
కదిలే సీతాకోకచిలుకలోని రంగులన్ని అద్ది,
లాలిత్య రేఖలతో నిన్నూహించనా!!

Sunday, August 3, 2008

దాగని ప్రేమ

ఓ వేసవి సాయంత్రం -
హేమంతంలో మనం కలుసుకున్న
సంధ్య గుర్తువచ్చింది.
ఆ రోజు -
నీకోసం మన ప్రేమని రహస్యంగ ఉంచమన్నావు
గడిపిన మధుర క్షణాలను మర్చిపోమన్నావు
అదే ఇప్పుడు దహించివేస్తుంటే
నా గొంతు మూగబోతుంది.
అందరూ చేరి ఏమైందని అడుగుతున్నా
మౌనమే రజ్యమేలుతుంది.
అయినా సరే -
ఇంత నిశ్శబ్దంలోనూ నా గుండె చప్పుడు
చాలానే చెప్పింది వాళ్ళకి!!

Wednesday, July 23, 2008

పొస్సెస్సివ్ ప్రేమ

నా ప్రేమలో - స్వార్థముందని నువ్వు భావిస్తే నా తపనలో - లోపముందని నీకు తోచితే, నా మనస్సులో - ఉక్రోషమున్నదని నీకు అనిపిస్తే, ఆ తలపే - మన మధ్య దూరనికి కారణమైతే - ఇక నిన్నేది అడగను. నేనేది పట్టించుకోను. ప్రశ్నలతో వేదించను. నువ్వు ఎటువెళ్ళినా - నువ్వేం చేసినా - ఎవరితో మాట్లాడినా - 'పార్టి ' కి వెళ్ళినా - స్నేహితులతో 'ఛాటింగ్ ' చేసినా - బంధువులతో 'సినిమా ' కి వెళ్ళినా - 'ఫోను ' లో ఎంతసేపు మాట్లాడినా - నాకిష్టంలేని పనిజేసినా - నా సమక్షంలో - నన్ను మరిచినా, నా పరోక్షంలో - నువ్వు హుషారుగా ఉన్న, నాకు అక్కర్లేదు, నేనేమి అడగను. ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... నన్ను మన్నించు!! నాకు అన్నీ తెలియాలి. అందుకే, నేను ప్రతీదీ అడుగుతాను!!

Tuesday, May 27, 2008

అంతులేని ప్రయాణం

నడిచే కాలం పయనించాల్సింది ఎంతో ఉంది

కనుచూపుమేరలో కూడా నీవు లేవు

నిన్ను అందుకోలేనని తెలుసు

అయినా నా ప్రయాణం సాగుతుంది

నిన్ను చేరుకోగలనని కాదు చెలియా!

నీ జ్ఞ్యాపకాలు వెంటాడుతున్నయని!!

Saturday, March 29, 2008

ఒంటరి

పంచేకొద్ది పెరిగేది ప్రేమ ఐతే
పదింతలు అయ్యేది సంతోషం
సగానికి తరిగేది బాధైతే
మనసున్న మనిషికి మిగిలేది రగిలే నిన్నలే!!
ప్రేమను ఏనాడో అంకితం చేసిన నా
జీవితంలో మెరుపులా మెరిసింది ఓ ప్రత్యూషం!
నిద్రిస్తున్న నా మనసును మేల్కొల్పి
తీయని కలలను పంచింది.
విధిని ఎదురించలేని ఆ కాలం ఈదురుగాలిలా
మారి నా కలల దీపాన్ని ఆర్పేసింది.
ఎన్నొ మలపులు తిరుగుతున్న జీవితంలో
నీ ఎడబాటు ఉప్పెనగా మారి నా సంతొషాన్ని ముంచేసింది!
అందరి మధ్యన నువ్వుండి నన్ను
మరచి కొత్త మార్పుని వెతుక్కున్నావు!
ఎందరు వున్న నిను చేరలేక
నీ ఆలొచన నన్ను వీడక వెంటాడినావు!!
నేడు నువ్వు నన్ను పూర్తిగా మరిచావు
నేను మాత్రం పూర్తిగ నువ్వయ్యను!!
నీవైన నేను కూడా క్రొత్త మార్పును స్వాగతించాను
నిన్ను తలచి తలచి ఇంక మరువదలచాను.
కొత్త బంధాలను పెనవేసుకుంటూ
పాత మనుషులను వెతుక్కుంటూ
చేదు ఙ్ఞ్యాపకాలను మరచిపోతూ
నవ జీవనానికి నాంది పలికాను!
ఈ లోకాన్ని కొత్త కోణంతో చూస్తున్నాను
మరల మార్గాలను అన్వేషిస్తున్నాను
నా గతాన్ని తుదిపివేయలేక, నేటిని
రంగవల్లులతో అలంకరిస్తున్నాను..
అడుగు ముందుకు వేస్తూ కాలానుగుణంగా
సర్దుకుపోతున్న నాకు ఓ రోజు ఎదురైంది!
ఆ రోజే నాకు తెలిపింది, నీ ప్రేమ
సాక్షిగా ఏదొ శాపం నన్ను వెంటాడుతుందని!!
అందరు నా వాళ్ళే అనుకున్నా,
ఎవ్వరికి ఏమి కాలేక
నాకంటూ ఏమి లేదని, ఏది ఉండదని,
ఒంటరినని తెలుసుకున్నను!
మళ్ళీ నువ్వెళ్ళే దారిలోనే నీ తోడు కోసం వేచియున్నా!!

కలవరింత

నగరమంతా నిదురోయే ఈ నడిరేయిలో
నీ ఙ్ఞ్యాపకాలు నన్ను పదే పదే తట్టి లేపుతున్నాయి!
ఆరు బయట వీస్తున్న చల్ల గాలులు నన్ను
ఓదారుస్తున్నప్పటికి నా మనసు నీ తీయని
పలకరింపునే కోరుకుంటుంది! ఎన్నటికీ
నిను చేరలేనని తెలిసినా మాట వినని నా
మనసుని నువ్వైనా ఓ సారి బుజ్జగించలేవా?
ఈ నిశీధిలో ప్రత్యుషంలా రాలేవా??!!??

చిన్న విన్నపం!

రగిలే ఈ చీకటికి కరిగిపోతున్న నా జీవితంలో
నీ ఙ్ఞ్యాపకాలను మరువలేక నా మనసు వేదన పడుతుంది.
నీ చూపుతోనే చూసే నా కనులు
ఇకపై లోకాన్ని చూడలేక రెప్పలు వాలిస్తే
నా ఆలొచనలను ఆక్రమించే నీ గురించిన ఊహలు
నిన్నే తలుస్తూ నన్ను పూర్తిగా మరిచాయి!!
నీవు పలికే ప్రతీ మాటకు రాగం కట్టిన నా
గుండె నేడు నీ విరహాగ్నిలో నిన్నే
తలచుకుంటూ మూగబోయింది! తెలిసిన వాళ్ళు
ఎందరు వున్న నీవు లేక ఒంటరినై ఈ లోకంతో
పోరాడుతూ అందరికి అపరిచితుడనయ్యాను.
మనస్సులో మాత్రమే నన్ను నిలుపుకున్న నీకు
నా మది అక్షరముఖంగా చెబుతుంది!
నీకోసమే నేను అనేది నిజమైతే... నీ
పెదవిపై చెరగని చిరునవ్వుని అవుతాను...
నా దానివిగా నా జీవితాన్ని పంచుకో...
లేదా ఎడబాటుగా మారి నా ప్రాణం తీసుకో...
కాని కదలని శిలగా మాత్రం నన్ను మార్చకు!!