Tuesday, March 16, 2010

నిరీక్షణ

రాత్రులు కరిగిపోతాయి
పగలు గడిచిపోతాయి
నిద్దుర బరువుని నా
కనురెప్పలు అలవాటుగా
మోసేస్తాయి! ఎప్పుడైనా
నువ్వొస్తావని, రేయంతా
నీకోసం ఎదురుచుస్తానని,
నీకు తెలుసా!

నెమ్మదిగా సాగే మేఘంలా
మందితో గూడి వచ్చి ఆటల్లో
మునిగిపోతావు. అలా
మాటుగానైనా నిను చుసి
మురిసిపోతాను కాని,
ఎందుకనో కంటి చివర
తడి ఇబ్బంది పెడుతుంది!!

నిన్ను చూసిన ఆనందం కంటే
కినుకు వహించే నీ మనసే
నన్ను కష్టపెడుతుందేమో!

అయిన -
నీ పలకరింపుకోసం
పడిగాపులుకాస్తుంటానని
నీకు తేలుసా!!

2 comments:

శివ చెరువు said...

Nicely done. వికృతి నామ సంవత్సర శుభాకాంక్షలు.. - శివ చెరువు

Anonymous said...

అచ్చు వేయని ఆంబోతులా కుమ్మేసే కవిత్వమంటే ఇదే. చాలా బాగుంది.