Thursday, March 4, 2010

I MISS U

నేను అందరి మధ్యనే ఉంటాను, కానీ
ఏదో శూన్యం వేటాడుతుంది నన్ను,

అందరి అభిమానం పొందుతున్నాను, కానీ
నువ్వు చూపించిన తీరు వెంటాడుతుంది నన్ను,

కబుర్లెన్నో ఆలకిస్తుంటాను, కానీ
ఎవరి మాటలు నా చెవిని చేరవెందుకో,

నాకంటు లేనిది ఏదో తెలీదు, కానీ
నే కోరేది ఎల్లప్పుడూ నీ స్నేహమే!
అందుకేనేమో,

నీ వెలితితో నేనిప్పటికీ
అసంపూర్ణంగానే మిగిలిపోయాను

2 comments:

చెప్పాలంటే...... said...

chala chala baagundi

భావన said...

ఒంటరైన గుండెలో వెలిసిన చిత్రపటమొక్కట్టి బాగా ఆవిష్కరించారు. చాలా బాగుండి.