Friday, July 23, 2010

ప్రేమంటే..?


ప్రేమంటే -
నువ్వున్నప్పుడు నన్ను నేను
నువ్వులేనప్పుడు ఈ లోకాన్ని, మరిచిపోవడం

ప్రేమంటే -
నీ ఆరాధనలో నిలువెల్ల తడవడం
నీ ఎడబాటులో మునిగితేలడం

ప్రేమంటే -
నా మౌనానికి మాటలు నేర్పడం
నా మనస్సుకి వెన్నెల పంచడం

ప్రేమంటే -
ఈ ఊహలకి రెక్కలు తొడగడం
నా కలానికి కవితలు నేర్పడం

Tuesday, July 20, 2010

ఐ లవ్ యూ


వెంట నడిపించే 
నీ విరసాలంటే నాకు
చెప్పలేని ఇష్టము..
నీతో మరో మాట కలిపేందుకు
సాయం చేస్తుంటాయి..

నా మాటకి అడ్డుచూపే
నీ సరిపోలంటే
మరెందుకో ప్రియం..
మౌనం లో నిన్ను దర్శించమని
సలహాలిస్తుంటాయి..

వాలుగా జారే నీ చూపు
వెక్కిరింతలే
నేను గాంచే యోగము..
నే పోల్చలేనీ వస్తువేదో
కానుకీయమంటాయి..

ఎదురు పడని నీ కైపు
కనుదోయంటే
నా యదను కుదిపే రసితము..
మనోఙ్ఞ్యత ప్రాయమేదో
నన్ను కొమరారమంటాయి...

చకిత చిత్తమైన నీ
పెంకి మనసంటే
విడువలేని స్నేహం..
త్రస్తరించే దాని పలుకులేవో
పోలికలే వద్దంటాయి..

ఇది స్నేహమని మాత్రమే
తలచే ఆ సత్యమేదో
వివరించలేని నువ్వంటే
నాకు తరగని ప్రేమ..

ఇది తెలుసుకున్న మరుక్షణం
చిత్తురవయ్యే నువ్వంటే
నే చెప్పలేని భావం..!!

Sunday, July 18, 2010

ఎదురుచూపుమెరుపు చుక్కోటి తొంగి
నా వంక చూసింది...

మెతక మబ్బు కాటుకెట్టి
అడ్డు నిలిచింది...

కమ్మిన మబ్బు గుండెలో
వాన చినుకులు..
కంటి నిండ దాచలేని
ఈ నీటి చుక్కలు..

తేట పందిరిలో
మురిపించిన ఆకసం..

అడగించక తడిపెళ్ళిపోయింది
ఈ వడబావిలో

తెరిపే కాదేమో అని
తిరిగి చూసింది
తనవి తీరక సెగ చల్లారక.. 

ఆకసం


మెరుపు చుక్కోటి తొంగి
నా వంక చూసింది...

మెతక మబ్బు కాటుకెట్టి
అడ్డు నిలిచింది...

కమ్మిన మబ్బు గుండెలో
వాన చినుకులు..
కంటి నిండ దాచలేని
ఈ నీటి చుక్కలు..

తేట పందిరిలో
మురిపించిన ఆకసం..

అడగించక వార్వమాపెళ్ళిపోయింది
ఈ వడబావిలో!!దిలీపు గారి ఆకాశ కుసుమానికి నా స్పందంగా..


Monday, July 12, 2010

కన్నీరు


 ఎన్ని కవితలు ఎన్ని రకాలుగా రాసినా వాటిలోని భావాన్ని మహిత గారు నా ప్రేమికుల రోజు అనే కవితకి కామెంటుగా రాసిన కేవలం నాలుగంటే నాలుగే పంక్తుల్లోనే మొత్తం భావాన్ని దించేసారు. ఆ నాలుగు లైనులు నన్ను ఎంతగా ప్రభావితం చేసాయంటే even today, to this every second, they are haunting me like anything.  So, I wanted to dedicate a special post especially on her lines.  Thanks once again to Mahitha. Here it goes like this :

కనురెప్పలు మూయగానే కన్నుల్లో నిండుతున్న నీ రూపం

కనులు తెరవగానే కన్నీళ్ళుగా కారిపోతోంది.

నీ రూపం కన్నుల్లో నింపుకునే ఆఖరి ప్రయత్నం

ఎప్పటికీ తెరవని కన్నులేనేమో 


నాకెంతో గొప్పగా అనిపించిన భావం ఇది.  Anyone not agreeing with me, requesting not to pass any comments here. :) 

Friday, July 9, 2010

నిషిద్ధ్హ ప్రేమఎపుడూ మెరిసే నీ కనులు
ఎందుకు ఉద్వేగంగా మారుతుందో

యదలోనీ ప్రశాంతతను
తెలియని ఏ వాంఛ
నన్ను కబళిస్తుందో

దహించివేసే నా ఆరాధన
నీ మనసుని రగిలిస్తుందన ..
అల్లల్లాడుతున్న నా విరహం
నీ మృదుస్పర్శ కోసం తపిస్తుందనా ..

ఇన్నాళ్ళకు ఓడిన ఈ దూరం
మోహమై కరిగి మన హద్దులు
కడుగుతోంది ..
ఈ అడ్డు చెరిగిపోతుంది ..

భగ్గుమంటున్న ఒంటరితనపు
సెగలు కాల్చకముందే ..
నీ బాహుబంధాల్లో నలిగిపోనీ ..
తెలియని లోతులలోకి ఇంకిపోనీ ..
అలసి కృంగిపోనీ ..

నీలోకి
అవలీలగ
చొచ్చుకపొనీ ..

రమించే మత్తులో ఎదిగిన కోరికలు
పూర్తిగా లొంగిన ఈ క్షణంలో
చివరకు అచేతనంగానైనా
ఇమిడిపోనీ ..

ఇరువురి బాధలు కరిగే
ఈ ఘడియన ..
నీ తనువు చెప్పినట్టుగానే ..
ఈ రేయిని గడవనీ ..

ఈ వెచ్చటి వేదికపై
వేతన పెట్టిన కోర్కెల
ఆహుతి ఆరే దాకా సాగనీ ..

మన నిషిద్ధ ప్రేమను
నిలువెత్తు రగిలిపోనీ ..

కరుణించవూ

నా ప్రేమలో స్వార్ధం చూశావు
నా తపనలో తప్పులు వెదికావు
నా మనసో బంధమనుకున్నావు
నా అలుసో పంజరమనుకున్నావు

ఆ తలపులే మన  ఈ
దూరాలకు మూలాలైతే
ఆ తలపులు మనకికలేవు
ఈ దూరాలకిక అర్ధాల్లేవు

పరులతో మాటాడినా పార్టీలకు పరుగెట్టినా
చాటింగులో బిజీ ఐనా మూవీల్లో కుషీ ఐనా
ఫోనుల్లో ఎంగేజైనా సమక్షంలో నన్ను మరిచినా
పరోక్షంగా నను తలచినా ఎటెళ్ళినాఏంచేసినా
ఇంకేమీ అడగను నిన్నేమీ అడగను

నీ స్నేహం పొందాలన్న తపనలో తప్పులు చేశానేమో
నిను నొప్పించానేమో నన్ను మన్నించవూ

నిన్ను తెలుసుకోవాలన్న ఆతృతలో అవన్నీ అడిగానేమో
నిను నొప్పించానేమో కాస్త కరుణించవూ


(ఆత్రేయ కొండురు గారు నా పొస్సెస్సీవ్ ప్రేమ ని మెరుగు పరిచి ఈరూపంలో అందించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు.)