ప్రేమించాను ...
అవును ... నేను ప్రేమించాను
ప్రేమ అంటే తెలీని నేను నిన్ను గాఢంగా ప్రేమించాను
మనస్సుతో మాత్రమే స్ప్రుసించే మనస్సుని నీకే సమర్పించాను
అవును... నేను ప్రేమించాను
చిరుగాలికి గింగురులు తిరిగే నీ ముంగురులను ప్రేమించాను
తడి ఆరిన నీ కురులలో చిక్కులను ప్రేమించాను
మోచేయి దాటి నీ నడుము పై నాట్యం చేసే నీ జడను ప్రేమించాను
నీ నుదుటి పై తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న ఆ తిలకాన్ని ప్రేమించాను
అర్థ చంద్రాకారంతో నీ కనుల అందాలనూ ఇనుమడింప చేసే ఆ కనుబోమాలను ప్రేమించాను
అందమైన నీ కనులను సైతం అమితంగా ప్రేమించాను
అవును ... నేను ప్రేమించాను
ఒర కంటి తో వాలు చూపును విసిరే నీ కనులను ప్రేమించాను
ఆ కనులను కప్పె రెప్పలను ప్రేమించాను
ఆ రెప్పల మాటున కనుపాపలలో పసిడి కాంతులను ప్రేమించాను
అవును... నేను ప్రేమించాను
నీ చిలక ముక్కుని ప్రేమించాను, అందమైన ఆ పుదకాని ప్రేమించాను
దాని సోయాగాన్ని ప్రేమించాను, దాగి ఉన్న పొగరుని ప్రేమించాను
అవును ... నేను ప్రేమించాను
బుట్టలు వ్రేలాడే నీ చెవులను ప్రేమించాను, వాటి సున్నీతత్వాన్ని ప్రేమించాను
నీ చెవులకున్న తాపాన్ని సైతం ప్రేమించాను, అవును... నేను ప్రేమించాను
కవులు సైతం వార్ణించని నీ అందమైన పెదవులను ప్రేమించాను
రేగిన అలజడికి ఆదిరేటి పెదవుల్ని ప్రేమించాను
గులాబీ రంగుని పోలిన నీ ఆదరాల్ని ప్రేమించాను
మునిపంటి క్రింద నాలిగే చిన్ని పెదవిని ప్రేమించాను
అందమైన నీ చిరునవ్వుని కూడా ప్రేమించాను
అవును... నేను ప్రేమించాను
సిగ్గుతో ఏరుపెక్కిన నీ చెంపలను ప్రేమించాను
తామరాకు పై నిలవని నీటి బొట్టుల ఉండే నీ బుగ్గలను ప్రేమించాను
ముద్దు పెట్టె కొద్ది జారిపోయే నా పెదవులకు నేర్పిన కొత్త ఆటను ప్రేమించాను
అవును... నేను ప్రేమించాను
నా ముద్దుని స్వీకరించిన నీ చిన్ని గడ్డాన్ని ప్రేమించాను
వీణ తీగ వంటి నీ పొడవాటి మెడను ప్రేమించాను
నీ మెడను అలంకరించిన అభరణ అదృష్ఠాన్ని కూడా ప్రేమించాను
అవును ... నేను ప్రేమించాను
నీలో అణువణువూ ప్రేమించాను, అనువణువునూ ప్రేమించాను
ఆపాదమస్తాకం ప్రేమించాను, నీ హస్తాలలో పుస్తకాన్ని ప్రేమించాను
నీ సన్నని నడుముని ప్రేమించాను, నీ అందమైన కరములను ప్రేమించాను
నీ చేతి గాజులను ప్రేమించాను, నీ కాళ్ళ పట్టీలాను ప్రేమించాను
నీ జడలో మల్లెలను ప్రేమించాను, నీవు ఉన్న చోట వ్యాపించే పరిమళాన్ని ప్రేమించాను
నీ జడలో మల్లెలను ప్రేమించాను, నీవు ఉన్న చోట వ్యాపించే పరిమళాన్ని ప్రేమించాను
నీ చూపుని ప్రేమించాను, తేనె పలుకుల్ని ప్రేమించాను
నీ శ్వాసను ప్రేమించాను, ఆశను ప్రేమించాను
నీ మనసు చెప్పే ఊసులను ప్రేమించాను, నీ చెవులు వినే మాటలను ప్రేమించాను
నీ నడతని ప్రేమించాను, నడక ని ప్రేమించాను
మెరుపులీనూతున్న నీ మేని ఛాయను ప్రేమించాను
అన్నింటా నిను ప్రేమించాను, అంతటా నేను ప్రేమించాను
అవును... నేను ప్రేమించాను
ఆనాడు, అస్తమిస్తున్న సూర్యుడు నా జీవితంలో
వెలిగించిన ఈ ప్రత్యూషని నేను ప్రేమించాను
అవును ... నేను ప్రేమించాను
ఎంతగానో ప్రేమించాను ... ప్రేమిస్తూనే ఉన్నాను ...
ప్రేమిస్తూనే ఉంటాను ...
నీ ప్రేమకై ... నేను
1 comment:
prema ki haddulu levu..yes..u can love..:)
Post a Comment