Saturday, February 23, 2008

ప్రేమాగ్ని

జాబిలీ కన్నా అందమైన దానివని
నిను చేర వచిన నాకు నీ హృదయ
పాశాణాన్ని చూపావు! కోకిల
పలుకులని పలకరించిన నన్ను ఎందుకని
తూలనాడావు ? నా తప్పుని నీ నేరముగా
భావించి మన పరిచయానికి అడ్డుగా
మౌనాన్ని ఎందుకు నాటావు?
నీవెందుకిలా మారావు? నన్నెందుకు
దూరమ్ చేసావు? మాధురమైన ప్రేమలో
ధీర్గమైన ఘడియలా సాగుతూ నా మదికి
రంపపు కోతను మిగిల్చావు కదా! చివరి సారిగా
నీవు అందించిన ప్రేమను నీకే అంకితమివ్వాలని,
మనమిద్దరం గడిపిన క్శణాలను నీ సమక్షం లో నే
హృదయాగ్నకి ఆహుతి ఇవ్వాలని తలచిన నాకు
ఒకింత సాయం చేస్తావా?
ఆ సాయంలో తోడు నిలుస్తావా?
బదులిమ్మని నీ మౌనాన్నిబతిమాలినా
జవాబు లేదని జాబు పంపిన నీ చూపులు
నా గుండెలో శులాలై దిగాబడగా,
తిరిగిన నా కళ్ళల్లో సుడులు నీకు
బదులిచ్చినా మారని నీ మనసు కోసమ్
నేను ఒంటరిగానే ఆరిపోతున్న!
ఈ గాలిలో కలిసిపోతున్నా!!

5 comments:

Unknown said...

chaaala baagundhi

kRsNa said...

thnx tejas

Anonymous said...

చాలా బాగుంది. ఈ కవితలో ఇంత ఇంటెన్సిటి ఉండడానికి కారణం ఎమిటి. మీ బ్లాగ్లో ఎక్కువగా వేదన కి సంబంధించిన కవితలే ఉన్నాయి. ఇది మాత్రం చదివే వాళ్ళకి సూటిగా మనసుకి తగిలే కవిత.

Anonymous said...

hmmmmm.....manasulo ni bhavanalu cheppagalige meeru dhanyulu....cheppaleni vaaru...abhaagyulu.

pranu said...

nice one again.