మానుననే అనుకున్నాను
మోడువారిపోయి ఉన్నాను
ఆశల రెక్కలన్నీనేల రాలగా
జ్ఙ్యాపకంగా బరువుతో కృశించిపోతున్నాను.
తూరుపు తెలవారుతూండగా
లీలగా తాకిన ఏదో స్పందనగా
మనసత్వాలలో కొత్త వసంతంలా చేరి నిండిపోయావు.
నీ చిర్రుబుర్రు మాటలతో
అల్లరి కోపాలతో
గ్రీష్మమై నాకు ఊపిరి పోస్తు వచ్చావు
నీ ప్రతీ నవ్వు నాకు అందిస్తూ
ఆనందాన్ని రుచి చూపిస్తూ
శరదృతువై నా కన్నీటిని తుడిపేసావు
నన్ను నేను తెలుసుకోగా
నీకు నే దగ్గరవగా
నిన్ను నాలో దాచేయగా
హేమంతానివై పూర్తిగా ఒదిగిపోయావు.
నిన్ను నా చెంత చూసి
తారలన్ని చూపు తిప్పగా
రమణీయ రాగాలలో
నీ కబుర్లన్నీ ఆలకిస్తున్న వేళ
చిన్నబోయిన వెన్నెలంతా
నల్ల మబ్బు చాటు చేరి తుఫాను రేపింది.
కాలమంతా రెప్పపాటులో సాగిపోగా
మునుపటి ఏకాంతం మరల చేరగా
వెచ్చని నా కన్నీళ్ళు మంచుపొరని కరిగించగా
తిరిగొచ్చిన ఈ శిశిరంలో
చిగురించిన ఎడబాటుని నాకు జతచేసి
మరుపురాని జ్ఙ్యాపకంగా మిగిలిపోయి
నన్నొదిలిపోయావు!!
14 comments:
bavundanDi.
బాగుంది.
vamsi manasulo ni bhavaalanu ruthuvu la tho polustu...baaga ceppaavu..alage vasantam vastundemo kadaa taruvata :)
vamsi manasulo ni bhavaalanu ruthuvu la tho polustu...baaga ceppaavu..alage vasantam vastundemo kadaa taruvata :)
pranu
Bagundi
Bavundi Mee Kavitha.. KOTHI
చాలా బాగుంది వంశీ. ప్రణు అన్నట్టు వసంతం రావాలని నాకూ కోరికగా ఉంది.
:)
ఆలశ్యంగా వస్తాడని తెలిసి కూడా హేమంతం లో మంచు పూలు సూర్యుడి కోసం ఎదురుచూస్తాయి.
ఎప్పుడెప్పుడు వద్దామని ఆరాటపాడే వసంతం కోసం మనం ఎదురుచూడలేమా?
good!
good!
@ రాధిక
@ చైతన్య
@ ప్రాణు
@ జయ
@ ఆత్రేయ
@ మహి
@అశ్వినిశ్రీ
మీ అందరికి ప్రత్యేక ధన్యవాదాలు. ఆలస్యానికి క్షమించండి. నిజమే వసంతం వస్తుందేమో నాకు కొరికగానే ఉందీ చూడాలని. చూద్దాం.
నగ్న తరువులు --
పత్రాల, పుష్పాల దుస్తులు లేవు.
వసంతం వస్తోంది.
కనుక వసంతం వచ్చేస్తుంది. మరలా చక్రాన్ని మొదలెడుతుంది.
బొల్లోజు బాబా
@ B Baba
vaccEsinaTTE kada. jIvitam sAgutunTundi kAkapOtE ee sAri sari kotta anubhUtulatO. dhanyavAdAlu :)
Post a Comment