వృక్షం ఒకటే
చెరోవైపు ఎదిగిన కొమ్మలం
ఒకటవాలనుకున్న చుట్టపట్టాలం
సాంప్రదాయ దారాలలో
ఇరుక్కున్న చకోరులం
ప్రయాణం ఒకటే
చేరాల్సిన మజిలీలు వేరు
వీడలేక నువ్వొదిగిన తీరు
నాలో మెదిలే కొద్ది
రాలుతుంది కన్నీరు
ఆత్మ ఒక్కటే
ఎన్నటికి ఇక కలవలేము
నను మరిచిపోతూ నువ్వూ
నిను మరవలేక నేను
మరో తొటలో నిలువలేము
తపస్సు ఒక్కట
కలవని చూపుకి నిదురరాదు
వెన్నల నెలవంక పలకరించదు
నన్ను తాకని ఉషస్సులో
నా జీవితం తెలవారదు
కోరేది ఒక్కటే
అల్లల్లాడిన ప్రాణం అంతమైనప్పుడు
నేల రాలిన ప్రేమ కుసుమం
నే దోసిట పట్టుకుని
నిన్ను నేనూ చేరడం.
4 comments:
bavundi krish mee kavitha ....Bangaram
చాలా బాగుంది.
మంచి ముగింపునిచ్చారు.
వీలు చిక్కితే ఇవే భావాలతో వ్రాసిన ఈ కవితను చదవండి.
http://sahitheeyanam.blogspot.com/2008/11/blog-post_25.html
చాలా బాగుంది
వంశీ
ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు
Post a Comment