Monday, October 6, 2008

ఓదార్పు

మునుపటి కన్నా చేదుగా వచ్చిన
ఈ గ్రీషం కూడా నాకు తోడు లేకుండాపోయింది!
శరదృతువులోని ప్రతీ చినుకు నను తడుపుతూ
నా కన్నీరుని తుడుస్తుంది కాని, ఏ గాలీ
నను చేరదేం!! అయినా, ఆ నింగిలో ఎన్ని
మబ్బులున్నా, ఏ మేఘము నను ఓదార్చదెందుకని!
మండే ఎండకి, పడే వానకి, వీచే గాలికి -
వెలుగుని కమ్మే నిశికి, వేకువఝాము మౌనానికి -
అన్నిటికి తెలుసు. నేను ఎవరితోను ఏది పంచుకోనని!
అయినా, ఎందుకనో ఒక్కోసారి ఆరాటపడతాను.
'ఎవరన్నా నా మౌనానికి సాక్షి గావాలని'!

8 comments:

Bolloju Baba said...

చాలా బాగుంది.
మీ బ్లాగు కలర్స్ గ్లేరింగా ఉన్నాయి. గమనించగలరు. చదవటానికి ఇబ్బంది గా ఉంది.

బొల్లోజు బాబా

pranu said...

vodaarpu korukovatam lo tappu ledu..kaani aa voodarpu pondataaniki mundu mee bhadha, bhaavalu panchukovaalemo...manchi poem..baavundi.

మాగంటి వంశీ మోహన్ said...

ఊరుకోండి మాష్టారు..మీరు మరీను

శరదృతువులో పడిన ప్రతి చినుకు మీ కన్నీళ్లు తుడిచిపెట్టి, ఉన్న మబ్బుల్లో నీళ్లన్నీ మీ బాధలకే సరిపోతే , ఇక వేరేవాళ్ల కన్నీరు, మున్నీరు ఎలా తుడవాలి బబో అని, నీళ్లు లేక భోరుమంటున్న వాటిని ఎవరు ఓదారుస్తారు, వాటి బాధ ఎవడు పట్టించుకుంటాడు...అయినా ఎవరితో ఏదీ పంచుకోకుండా ఆరాట పడితే, ఎప్పుడూ కన్నీళ్లు కాక ఏమొస్తాయి...

స్పర్శకి అతీతంగా ఓదార్పు కావాలి అంటే మీరు వేసుకున్న ముసుగులో మీకు మీరు మనసుని తడుముకోవటమే... ఎవరి నునువెచ్చని ఒడిలోనో పడుకోవటం ఎందుకు? వేరే వాళ్ల గుండెల్లో గూడు కట్టుకోవటం ఎందుకు?

just kidding

kRsNa said...

@ బొల్లోజు బాబా గారు
నెనెర్లు. బ్లాగు టెంప్లేటు మారుస్తాను.

@ ప్రాణు
మంచి మాట చెప్పారు. నెనెర్లు.

@ వంశీ గారు
:P మీ కామెంటు నాకు అర్దమయ్యింది. నెనెర్లు. మీకు మైలు పెట్టాను. చూసుకోండి. :)

Unknown said...

sarigga nenu feelaye bhavale
prati akshram anubhutullonchi tongi choose reality
baga chepparu
abhinandanalu
swatee

kRsNa said...

@swatee sripada garu
thanq :)

Unknown said...

sparsa leni oodarrapaa....?? ante..dooram gaa vundi oodaarchalaa?? entoo ee kavula bhaavalu oka pattana ardam kavu...kani manchi padaalu...bavundi mee kavitvam....:)

kRsNa said...

@hasini garu
Odarpu anedi matallo untundi sparsalo untundi chupulo untundi. mana kanabarche abhimanam lo untundi. odilo talapettukuni seda teeradame odaarpu kaadu. chupinche anuraga bandhaallo kuda untundi ani naa abhiprayam. :)