Monday, October 3, 2011

భ్రమ


గాలినై తిరుగుతుంటాను
ఇప్పటికీ..ఇక్కడే.. ఎక్కడో..

గమ్యం తెలీని ప్రయాణానికీ
గమనమై ఆసలు నింపావు

నా గగనానికి దారులు వేస్తు
నీ వారధులను కూల్చుకున్నావు
ఆ తారలను అన్వేషిస్తూ నేను
ఇప్పటికీ.. ఇక్కడే.. ఎక్కడో..

అబద్దపు మమతలను ప్రోగు చేస్తు
నిజమైన బంధాలు తుంచుకుంటున్నాను
అదే భ్రమలో జీవిస్తూ ఇంకా
ఇప్పటికీ.. ఇక్కడే.. ఎక్కడో..
గాలినై తిరుగుతున్నాను...

4 comments:

శ్యామలీయం said...

బాగుంది. కాని నిరాశావాదం ధ్వనిస్తోంది అంతర్లీనంగా.

kiran said...

hmmmmmmmmmmmmmmmmm...........ఏదో ఒక రోజూ భోరుమని ఏడ్చేస్తాను...మీ టపాలు చదివి...

Anonymous said...

endukanDi antha nirAsa..bavundi.

Sri Valli said...

chala bavundi me poem :)