Thursday, September 2, 2010

వెతలు

రోజులన్నీ గడిచిపోతూనే కాలం
నా దగ్గర నిలిచిపోయింది
నన్ను తాకని ఈ గాలిలో
రాతలు నేర్పుతూ మరో రేయి కలిసిపోయింది

మర వెలుతురులో మసకబారుతున్న కనులు
మరువలేనంటూ తోడు నిలుస్తున్నాయి కలలు

క్షణాలన్నీ నాకేసి జాలిగా చూస్తూ
తడి చూపులలో తేలక మునిగిపోతున్నాయి
గతించిన కాలం వెక్కిరిస్తూ సాగనంపుతుంది
గతమెరిగిన జీవితం 'నేను 'ని శాసిస్తుంది

కదిలి వస్తూనే కడలి, గురుతులన్నీ
చెరిపేసి పోయింది
కదలకనే అడుగులేమో, కొత్త
గీతలు గీస్తూ ఉండిపోయింది 

రోజులన్నీ గడిచిపోతూ కాలం
నా దగ్గర నిలిచిపోయింది
నన్ను తాకని ఈ గాలిలో
రాతలు నేర్పుతూ మరో రేయి కలిసిపోయింది. 

12 comments:

చెప్పాలంటే...... said...

chalaa baagaa chepparu mi kavitalo manasu ki taakindi mi kavita....

Unknown said...

super andi...
intha manchi ga rayali ante entha feel avvalo kada.. :(...
meeru blog lo replies ivvara??

Padmarpita said...

Its beautiful......

Krishna said...

Thanks to all of you for visiting and commenting on my poems. I always feel honour getting comments from you guys.

@kiranmai : Time is one thing that I always feel to have 48hrs in a day rather than 24 hrs ;-). I planned such that the least leisure time I usually get should be devoted to reading other blogs and posting comments rather than concentrating on my own blog. Hence I could not reply much and sorry for that. I will try to do so from now.

Anonymous said...

బావుంది.

"ఎప్పటికీ నాతో నడవని నీకోసం
ఇప్పటికి ఇక్కడే ఆగిపోతానంటున్న గుండె వంక చూసి
తెలుసుకున్నాను నాకు నీ గ్నాపకాలు కూడా మిగలలేదని"

Krishna said...

@anonymous

Thanks for visiting. I liked your lines too.

kiran said...

Thank u and wisgh u the same.. :)

జయ said...

మీకు నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.

Ennela said...

I wish you happy new year andee..meeru chala chala ilanti manchi kavitalu wraayalani korukuntunna...best wishes

ఇమకి (ఇవటూరి మధు కిరణ్) said...

arey chala bagundhi ... idhi .. oka chinna doubt .. second para lo mara velugu ane word use chesavu.. ikkada mara ki meaning enti?

Praveen Mandangi said...

ఇక్కడ అడ్వర్టైజ్ చేస్తున్నందుకు క్షమించాలి. తెలుగు బ్లాగర్లకి గమనిక. మా అగ్రెగేటర్ తెలుగు వెబ్ మీడియా - కెలుకుడు బ్లాగులు గానీ బూతు బ్లాగులు గానీ లేని ఏకైక సకుటుంబ సపరివార సమేత అగ్రెగేటర్ http://teluguwebmedia.in యొక్క సర్వర్ ఇండియన్ డేటా సెంటర్‌లోకి మార్చబడినది. ఈ సైట్ ఇతర దేశాల కంటే ఇండియాలో మూడు రెట్లు వేగంగా ఓపెన్ అవుతుంది. భారతీయుల కోసమే ఈ సౌలభ్యం. మీ సైట్‌ని మా అగ్గ్రెగేటర్‌లో కలపడానికి praveensarma[at]teluguwebmedia.in అనే చిరునామాకి మెయిల్ చెయ్యండి.
ఇట్లు నిర్వాహకులు

Krishna said...

@ఇమకి

ఏమి లేదు. విద్యుద్దీపాలకి మర వెలుతురు అని చిన్న ప్రయోగం అంతే. ఇంకోటి, ఇది రాసినప్పుడు రాతిరి 2 దాటింది. అంతకు పది నిమిషాల ముందు నేను నిలుచున్న చోట సౌర విద్యుద్దీపాల స్థంభాలను చూసాను అందుకే అలా పదం ఉపయోగించాను.