Thursday, September 2, 2010

వెతలు

రోజులన్నీ గడిచిపోతూనే కాలం
నా దగ్గర నిలిచిపోయింది
నన్ను తాకని ఈ గాలిలో
రాతలు నేర్పుతూ మరో రేయి కలిసిపోయింది

మర వెలుతురులో మసకబారుతున్న కనులు
మరువలేనంటూ తోడు నిలుస్తున్నాయి కలలు

క్షణాలన్నీ నాకేసి జాలిగా చూస్తూ
తడి చూపులలో తేలక మునిగిపోతున్నాయి
గతించిన కాలం వెక్కిరిస్తూ సాగనంపుతుంది
గతమెరిగిన జీవితం 'నేను 'ని శాసిస్తుంది

కదిలి వస్తూనే కడలి, గురుతులన్నీ
చెరిపేసి పోయింది
కదలకనే అడుగులేమో, కొత్త
గీతలు గీస్తూ ఉండిపోయింది 

రోజులన్నీ గడిచిపోతూ కాలం
నా దగ్గర నిలిచిపోయింది
నన్ను తాకని ఈ గాలిలో
రాతలు నేర్పుతూ మరో రేయి కలిసిపోయింది.