నా ప్రేమలో స్వార్ధం చూశావు
నా తపనలో తప్పులు వెదికావు
నా మనసో బంధమనుకున్నావు
నా అలుసో పంజరమనుకున్నావు
ఆ తలపులే మన ఈ
దూరాలకు మూలాలైతే
ఆ తలపులు మనకికలేవు
ఈ దూరాలకిక అర్ధాల్లేవు
పరులతో మాటాడినా పార్టీలకు పరుగెట్టినా
చాటింగులో బిజీ ఐనా మూవీల్లో కుషీ ఐనా
ఫోనుల్లో ఎంగేజైనా సమక్షంలో నన్ను మరిచినా
పరోక్షంగా నను తలచినా ఎటెళ్ళినా, ఏంచేసినా
ఇంకేమీ అడగను నిన్నేమీ అడగను
నీ స్నేహం పొందాలన్న తపనలో తప్పులు చేశానేమో
నిను నొప్పించానేమో నన్ను మన్నించవూ
నిన్ను తెలుసుకోవాలన్న ఆతృతలో అవన్నీ అడిగానేమో
నిను నొప్పించానేమో కాస్త కరుణించవూ
(ఆత్రేయ కొండురు గారు నా పొస్సెస్సీవ్ ప్రేమ ని మెరుగు పరిచి ఈరూపంలో అందించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు.)