ప్రేమ . . . ప్రేమ . . . ప్రేమ . . .ప్రేమ . . .
ఇదొక అందమైన పదం
అంతకు మించి ఒక అందమైన అనుభవం.
ఆది కేవలం పొందడం లో కాదు,
ఇవ్వడంలోనూ ఉంది, ఇవ్వడంలోనూ ఉంది.
ప్రేమ . . . కొందరికి మాత్రమే దక్కే వరం
వారి ఆనందానికి ఆ అంబరమే హద్దు
మనసుని మాయ చేసేది ప్రేమ,
ఎన్నో భావనలకుజన్మనిచ్చేది ఈ ప్రేమ.
చిక్కబడ్డ కటిక చీకటి ని సైతం వెలుగుతో నింపేది ప్రేమ,
గుండె నిండా పేరుకున్న కొండంత బాధను కరిగించేది ప్రేమ.
నా కళ్ళలో కోటి కాంతులను నింపింది ప్రేమ,
మాటలు రాని నా మౌనానికి కవితలు నేర్పింది ఈ ప్రేమ.
ఇష్టం అంటే తెలీని నాకు నిన్ను ప్రేమించేలా చేసింది ప్రేమ,
నిన్ను ప్రేమించన నేను, నన్ను నేను మరిచేలా చేసింది ఈ ప్రేమ.
కళ్ళలో కనిపించేది మాత్రమే కాదు ప్రేమ,
మనస్సుతో స్పృసిస్తే కలిగే పారవశ్యమె ఈ ప్రేమ.
నీ కోసం తపన పడేలా చేసింది నా ప్రేమ
నా కోసం కన్నీరు సైతం రాల్చావు అదే ప్రేమ.
ఒక్క ఘడియైనను నా తలపుల నుండి నీవు వీడలేదు,
ఇది నా ప్రేమనీ మనసు నిండా నా తలపులతోనే నింపావు, ఇదే నిజమైన ప్రేమ.
నా ప్రేమను నీకు అంకితమిచ్చాను, ఇది నా ప్రేమ,
నీ మనసుని నాకు అర్పించావు, ఇదే నిజమైన ప్రేమ, నీదే నిజమైన్ ప్రేమ.
రగిలే మంటల్లో చల్లని జాబిలి నీ ప్రేమ
నిశీధి లో ఓ ప్రత్యుషం నీ ప్రేమ
ఉరకలెత్తే అలలకు తీరం నీ ప్రేమ
మౌనం లో పలకరింపు నీ ప్రేమ
కురిసే మంచులోనూ పరిమళించే పువ్వు నీ ప్రేమ
తెల్లవరుఝాము పక్షుల రాగాలు నీ ప్రేమ
గల గల పారుతున్న నదిలో సంగీతం నీ ప్రేమ
ప్రేమ మాత్రమే నిండిన తీయని పలకరింపు, నీ ప్రేమ.
ఈ, నీ ప్రేమ, నాకు మాత్రమే దక్కాలని సదా ఆశిస్తూ . .
నా జీవితాన్ని నీకు అంకితమిస్తున్నాను . . .